టొమాటో సూప్ | Tomato Soup | Healthy Recipes | Easy Tomato Soup Recipe | Weight Loss Recipes

టొమాటో సూప్ చాలా రుచికరంగా ఉంటుంది. దీనిలో ఇంకా మంచి రుచి, రంగు కోసం క్యారెట్లు కూడా వేసి చేశాము. మీరు కావాలంటే క్యారెట్లు లేకుండా కూడా టొమాటో సూప్ చేసుకోవచ్చు. ఈ సూప్ను బ్రెడ్ స్టిక్స్తో లేదంటే గార్లిక్ బ్రెడ్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.

#tomatosoup #homecookingtelugu #easytomatosoup #homecooking #hemasubramanian

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase

Here's the link to this recipe in English:

తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 25 నిమిషాలు
సెర్వింగులు: 4

కావలసిన పదార్థాలు:

పచ్చి వెన్న – 50 గ్రాములు
వెల్లుల్లి రెబ్బలు – 7 (తరిగినవి)
బిర్యానీ ఆకు – 1
ఉల్లిపాయలు – 2 (తరిగినవి)
క్యారెట్లు – 2
టొమాటోలు – 10
ఉప్పు – 2 టీస్పూన్లు
మిరియాల పొడి – 1 టీస్పూన్
నీళ్లు – 2 కప్పులు
పంచదార – 1 టీస్పూన్
మిరియాల పొడి
బేసిల్ ఆకులు
నీళ్లు

తయారుచేసే విధానం:
బాగా పండిన టొమాటోలని చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి

ఒక పాన్లో పచ్చివెన్న వేసి, అది కరిగిన తరువాత వెల్లుల్లి, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు రంగు మారేంత వరకూ వేయించాలి

ఆ తరువాత తరిగిన క్యారెట్లు వేసి కాస్త వేయించిన కాసేపటికి తరిగిన టొమాటోలను కూడా వేసి కాస్త వేయించాలి

ఇందులో ఉప్పు, మిరియాల పొడి వేసి టొమాటోలని కనీసం 3 నిమిషాలు మగ్గనివ్వాలి

ఇప్పుడు నీళ్లు పోసి, పాన్కు మూత పెట్టి, టొమాటోలని పదిహేను నిమిషాల పాటు మగ్గించాలి

పదిహేను నిమిషాల తరువాత పొయ్యి కట్టేసి, టొమాటో క్యారెట్ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి

బిర్యానీ ఆకుని తీసేసి, చల్లారిన టొమాటో క్యారెట్ మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తటి ప్యూరీ అయ్యేట్టు రుబ్బుకోవాలి

రుబ్బిన మిశ్రమాన్ని ఒక జల్లెడలో వేసి వడకట్టి, మెత్తటి పేస్టుని ఒక పాన్లో వేసి వేడి చేయాలి

ఇందులో పంచదార, మిరియాల పొడి, బేసిల్ ఆకులు వేసి సన్నటి సెగ మీద ఐదు నిమిషాలు మరిగించాలి

రుచి చూసి కావాలంటే ఉప్పు కానీ మిరియాల పొడి కానీ వేసుకోవచ్చు

అంతే టొమాటో సూప్ తయారైనట్టే. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది

You can buy our book and classes on

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE:
FACEBOOK –
YOUTUBE:
INSTAGRAM –

A Ventuno Production :

Click Here To Find Out More

 

Loading ....

Recommended For You

About the Author: AllAboutu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

google.com, pub-1888464248613961, DIRECT, f08c47fec0942fa0